పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా విడుదలకి ముందే రికార్డులు బద్దలు కొడుతుంది. మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ చిత్ర ఉత్తరాంధ్ర పంపిణీ హక్కులు రికార్డు స్థాయిలో 4 కోట్ల 10 లక్షలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏ చిత్రానికి అయినా ఈ ఏరియాలో ఇదే అత్యదిక మొత్తం. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ భారీ హిట్ సాధించి ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. గబ్బర్ సింగ్ భారీ హిట్ సాధించడం, పవన్ – పూరి కాంబినేషన్ అనగానే అంచనాలు తారా స్తాయిలో ఉండటంతో ఈ సినిమా పై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. పవన్ సరసన తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.