ప్రత్యేకం : శ్రీ కృష్ణదేవరాయలుగా రానున్న బాలకృష్ణ


నటసింహం నందమూరి బాలకృష్ణ నటించనున్న మరో కొత్త చిత్రం గురించిన విశేషాలను ప్రత్యేకంగా మీకందిస్తున్నాం. బాలకృష్ణ మరియు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు కలిసి మరో చిత్రం చేయనున్నారు. వీరిద్దరూ కలిసి ఆంధ్ర భోజ శ్రీ కృష్ణదేవరాయలు గారి చరిత్ర మీద ఒక చిత్రం చేయనున్నారు. సాంప్రదాయ మరియు పౌరాణిక పాత్రలు చేయడంలో బాలకృష్ణ సిద్ద హస్తుడు మరియు ఆయన ‘ఆదిత్య 369’ సినిమాలో చేసిన శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

ప్రస్తుతం రాఘవేంద్ర రావు గారు టాలీవుడ్ లోని టాప్ కథా రచయితలతో కలిసి ఈ చిత్రానికి సంభందించిన కథా చర్చలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ‘ఆదిత్య 369’ కి సీక్వెల్ గా రూపొందనున్న ‘ఆదిత్య 999’ చిత్రానికి సంభందించిన కథా చర్చలు మరియు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో మొదట ఏది సెట్స్ పైకి వెళ్లనుంది అనేది ఇంకా తెలియలేదు.

ఈ రెండు చిత్రాలకు సంభందించిన వారు మాకు అందుబాటులోకి రాగానే ఆసక్తికరమైన ఈ రెండు చిత్రాల విశేషాలను మీకు తెలియజేస్తాము.

Exit mobile version