త్వరలో ‘ఎందుకంటే ప్రేమంట’ షూటింగ్ పూర్తి


ఆ జంట మధ్య ఉన్నది ప్రేమంట. దాని కోసమే వారి తపనంట. ఇంతకు ఆ జంట ఎవరంట? వారెవరో కాదు రామ్, తమన్నా. వీరిద్దరు కలిసి నటిస్తున్న ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం ఒకటి, రెండు రోజుల్లో పూర్తి కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. జివి ప్రకాష్ కుమార్ అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని మే నెల ద్వితీయార్ధంలో విడుదలకు సిద్ధమవుతుంది. ప్రేమకథా చిత్రాలను అందంగా తెరకెక్కించే కరుణాకరన్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు.

Exit mobile version