ఎందుకంటే ప్రేమంట తన డ్రీం ప్రాజెక్ట్ అంటున్న రామ్


రామ్ నటిస్తున్న చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’ తన డ్రీం ప్రాజెక్ట్ అంటున్నాడు. ఈ సినిమా నను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. నేను చాలా రోజుల నుండి కరుణాకరన్ గారితో పని చేయాలనుకున్నాను ఆ కల ఇప్పటికి నెరవేరింది. ఇంకో ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం తనకు చాలా సంతృప్తి ఇచ్చిందని అంటున్నాడు రామ్. ఈ రోజు దసపల్ల హోటల్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలో రామ్ ఈ మాటలు అన్నాడు. ఈ సినిమాకి పని చేసిన మిగతా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. చిత్ర నిర్మాత స్రవంతి రవి కిషోర్, చిత్ర దర్శకుడు కరుణాకరన్, సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ, గేయ రచయిత కృష్ణ చైతన్య తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Exit mobile version