మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణ నటులలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. డైలాగ్ డెలివరీ విషయంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్న అయనకి ‘నటవాచస్పతి’ ఇచ్చారు. నిన్న నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డునిచ్చి సన్మానించారు. డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీదుగా ఆయనకు అవార్డును బహుకరించి త. సుబ్బరామిరెడ్డి ఆయనను సన్మానించారు. టిఎస్ఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ డి రామానాయుడు, మురళి మోహన్, వాణిశ్రీ, పరుచూరి బ్రదర్స్, కోడిరామకృష్ణ, బ్రహ్మానందం, అలీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 123తెలుగు.కాం తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.