దసరా బరిలో మంచు విష్ణు దూసుకెళ్తా?

దసరా బరిలో మంచు విష్ణు దూసుకెళ్తా?

Published on Sep 25, 2013 12:13 PM IST

Doosukeltha

మంచు విష్ణు హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘దూసుకెళ్తా’. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుందింఎము విన్న సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం దసరాకి సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మూవీలో ‘అందాల రాక్షసి’ ఫేం లావణ్య త్రిపతి హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో లావణ్య చాలా కొత్తగా మరియు స్టైలిష్ అవతారంలో కనిపించనుంది. అలాగే మంచు విష్ణు కూడా కండలు తిరిగిన ఫిజిక్ తో కనిపించనున్నాడు.

బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుందని ఆశిస్తున్నారు. వీరూ పోట్ల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీకి సర్వేశ్ మురారి సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు