నా విజయాలన్నింటికీ వారే కారణం : అల్లు అర్జున్


ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటీనటులకు, దర్శకులకు మరియు నిర్మాతలకు విజయం అనేది అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంటుంది. ఎవరైతే నిత్రంతరం కృషి, పట్టుదలతో పనిచేసి మరియు ఎవరైనా తప్పుల గురించి చెబితే వాటిని సరిదిద్దుకొనే మనస్తత్వం కలిగి ఉన్న వారిని విజయం వరిస్తుంది మరియు అలా విజయం సాదించిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట నా టీం సహాయ సహకారాలు లేకపోతే నేను ఇంతటి విజయం సాదించే వాన్ని కాదు అని అంటుంటారు. ఇలాంటి వారి లోంచి బన్నిని తీసేయ్యాలి. ఎందుకంటే బన్ని తన విజయాలకు దర్శకులే కారణమని అంటున్నాడు. నిన్న జరిగిన జులాయి సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ నేను నటుడిగా ఇంత పేరు సంపాదించుకోవడానికి మరియు నా సినిమాలు అంతటి విజయాలు సాదించటానికి ముఖ్య కారకులు నా దర్శకులు మరియు వారి టీం. నా తాజా చిత్రం జులాయి కోసం నాకంటే ఎక్కువగా నా దర్శకుడు త్రివిక్రమ్ గారే కష్టపడ్డారు అని’ ఆయన అన్నారు.

ఈ సందర్భంగా బన్ని తెలుగు సినీ ప్రేక్షకులపై ప్రశంశల జల్లు కురిపించారు. ‘ నేను ఒక సినిమా కోసం ఎంత కష్టపడి పని చేస్తాను మరియు నా టాలెంట్ ని గుర్తు పట్టి ప్రేక్షకులు అందించిన ప్రోత్సాహం వల్లే నటుడిగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి ఇంతటి వాన్ని అయ్యాను. నేను ఏ సినిమానైనా రెండు విధాలుగా నటిస్తాను ఒకటి కథా పరంగా మరియు రెండవది పాటలకి తగ్గట్టు నటిస్తాను. ‘ఆర్య’ సినిమా నుంచి నా సినిమాలకు మలయాళంలో మంచి ఆదరణ లబిస్తోంది. నా ‘జులాయి’ చిత్రాన్ని కూడా ఈ నెల 17న మలయాళం లో విడుదల చేయనున్నాం’ అని ఆయన అన్నారు.

అల్లు అర్జున్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ ఈ స్టొరీ మీద మేము ఇద్దరం ఎంతో కష్టపడి పనిచేశాము. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అలా ఎందుకు చేయడంలేదు? అని బన్ని నన్ను ఎప్పుడు అడగలేదు, అతను పూర్తిగా నన్ను నమ్మి ఈ సినిమా చేశాడు. ఆ విషయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని’ ఆయన అన్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి చూశాను. వాళ్ళు సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారని’ ఆయన అన్నారు. డి.వి.వి దానయ్య మరియు ఎస్. రాధాకృష్ణ కూడా ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు.

Exit mobile version