‘అన్నమయ్య’ మరియు ‘శ్రీ రామదాసు’ చిత్రాల తర్వాత అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’. సెప్టెంబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రం యొక్క పంపిణీ హక్కులను ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్లు చేజిక్కించుకున్నారు. నైజాం పంపిణీ హక్కులను నిర్మాత దిల్ రాజు దక్కించుకోగా, కృష్ణా జిల్లా పంపిణీ హక్కులను నిర్మాత సి. అశ్వినీదత్ దక్కించుకున్నారు. ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలైన ఈ చిత్ర పాటలకి మంచి ఆదరణ లబించడంతో ఈ చిత్ర ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ కాంత్, శరత్ బాబు మరియు కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఎ. మహేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు.