మన టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోస్ లో నటన పరంగా ప్రాణం పెట్టే అతి కొద్ది మంది హీరోస్ లో అల్లరి నరేష్ కూడా ఒకరు. తన నటనతో ఎంత నవ్వించగలడో అంతే రీతిలో ఏడిపించగల హీరో నరేష్. అయితే ప్రస్తుతం సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ నుంచి తన కెరీర్ 63వ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఇపుడు బయటకి వచ్చింది.
దీనితో అల్లరి నరేష్ నెక్స్ట్ తాలూకా ఫస్ట్ లుక్ సహా టైటిల్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. రేపు జూన్ 30న వచ్చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ టైటిల్, ఫస్ట్ లుక్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తుండగా సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అలాగే శ్రీకార స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తుండడం విశేషం.