అఫీషియల్: థియేటర్స్ లోనే ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ బ్లాస్ట్!

అఫీషియల్: థియేటర్స్ లోనే ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ బ్లాస్ట్!

Published on Jun 29, 2025 7:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రాల్లో భారీ పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా చాలా వాయిదాలు తర్వాత జూలైకి ఫిక్స్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు థియేటర్స్ లో మరో బ్లాస్ట్ ఇపుడు సిద్ధం అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ థియేటర్స్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని కొన్నాళ్ల కితం తెలిపాము.

ఇక ఫైనల్ గా దీనిపై మేకర్స్ అఫీషియల్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేసారు. దీనితో ఈ జూలై 3న వీరమల్లు ట్రైలర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లోనే విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఇది డెఫినెట్ గా సినిమాకి బూస్టప్ ఇచ్చే మూవ్ అని చెప్పవచ్చు. ఈ జూలై 3న ట్రైలర్ థియేటర్స్ లో సహా ఆన్లైన్ లో కూడా విడుదల కానుంది. దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు