ఫుల్ స్వింగ్ లో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. కీలక సన్నివేశాల్లో

ఫుల్ స్వింగ్ లో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. కీలక సన్నివేశాల్లో

Published on Jun 29, 2025 10:00 PM IST

మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఆంధ్రా కింగ్ తాలూకా”. ప్రతీ ఫ్యాన్ బయోపిక్ అంటూ దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సాలిడ్ మూమెంట్స్ తో ఫుల్ స్వింగ్ లో తెరకెక్కుతుంది.

అయితే ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గానే హైదరాబాద్ లో థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామాకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించుకోగా ప్రస్తుతం షూటింగ్ రాజమండ్రిలో చేస్తున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. హీరో రామ్ అలాగే వెర్సటైల్ నటుడు రావు రమేష్ లతో సన్నివేశాలు చేస్తున్నారు.

ఇక వీటిపై వదిలిన వర్కింగ్ స్టిల్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ – మెర్విన్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు