బాయ్స్ మళ్ళీ వచ్చేస్తున్నారు.. ‘ఈ నగరానికి ఏమైంది 2’ క్రేజీ టీజర్

బాయ్స్ మళ్ళీ వచ్చేస్తున్నారు.. ‘ఈ నగరానికి ఏమైంది 2’ క్రేజీ టీజర్

Published on Jun 29, 2025 11:41 AM IST

మన తెలుగు సినిమా యువత దగ్గర మంచి క్రేజ్ ఉన్న సాలిడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల్లో “ఈ నగరానికి ఏమైంది” కూడా ఒకటి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం పట్ల కూడా మంచి ఆసక్తి నెలకొంది. ఇలా మొత్తానికి ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇన్ని రోజులు హింట్స్ తర్వాత ఇప్పుడు క్రేజీ మోషన్ పోస్టర్ టీజర్ తో అనౌన్సమెంట్ వచ్చేసింది.

దీనితో ఈ నగరానికి ఏమైంది 2 ని “ఈ నగరానికి ఏమైంది రిపీట్” గా ప్రెజెంట్ చేస్తూ ఈసారి అడ్వెంచర్ మరింత ఎంటర్టైనింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి గతంలో కార్ తో రోడ్ ట్రిప్ అయితే ఇప్పుడు ఫ్లైట్ లో ఉండేలా అనిపిస్తుంది. మొత్తానికి అయితే మళ్ళీ వివేక్ అండ్ గ్యాంగ్ మళ్ళీ తెలుగు యువతకి మెమొరబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారనే చెప్పొచ్చు. ఇక ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు