బిగ్ బాస్ 9 సర్ప్రైజ్.. తెలుగు ఆడియెన్స్ కి రిటర్న్ గిఫ్ట్ తో వచ్చిన మేకర్స్!

బిగ్ బాస్ 9 సర్ప్రైజ్.. తెలుగు ఆడియెన్స్ కి రిటర్న్ గిఫ్ట్ తో వచ్చిన మేకర్స్!

Published on Jun 29, 2025 5:00 PM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర పెద్ద హిట్ అయ్యిన గ్రాండ్ రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. తెలుగు సినిమా సహా బుల్లితెరపై సంబంధించిన తారలతో ఎంతో ఎంగేజింగ్ గా నడిచే ఈ డ్రమాటిక్ రియాలిటీ షో తెలుగులో మొత్తం 8 సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈసారి బిగ్ బాస్ పై అప్పుడే గ్రాండ్ అప్డేట్ వచ్చేసింది. ఈసారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జున మళ్ళీ షైన్ అవ్వబోతుండగా మేకర్స్ ఓ ఊహించని అప్డేట్ తో ముందుకొచ్చేసారు.

అయితే ఈసారి సీజన్ లో ఇంతగా ఆదరించిన తెలుగు ఆడియెన్స్ కి రిటర్న్ గిఫ్ట్ తో వచ్చారు. దీనితో ఈసారి సినీ తారలతో పాటుగా సామాన్య ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయ్యేందుకు అవకాశం ఇస్తూ తమ జియో హాట్ స్టార్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. మరి ఇది కామన్ ఆడియెన్స్ కి ఒక సువర్ణ అవకాశమే అని చెప్పవచ్చు. ఇక దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు