“వకీల్ సాబ్” రాకపై సర్వత్రా ఉత్కంఠ.!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం “పింక్”కు రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరాం వేణు తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలకు మాత్రం కరోనా పెద్ద బ్రేక్ నే వేసింది.

ఇక ఇదిలా ఉండగా ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ పవన్ షూట్ ను మొదలు పెట్టేసారు. దీనితో ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న “వకీల్ సాబ్” టీజర్ కోసమే అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూట్ మళ్ళీ మొదలు కావడంతో టీజర్ ఈ దీపావళికే అని అంతా గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు. మేకర్స్ కూడా అదే ప్లాన్ లో ఉండగా ఈ టీజర్ అప్పుడే వస్తుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Exit mobile version