సవారి చిత్రంపై కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి ప్రశంసలు

నందు, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్స్ గా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సవారి. ఈ చిత్రం గతవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా తెలంగాణా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సవారి చిత్రంపై ప్రసంశలు కురిపించారు. సవారి టీమ్ ని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకొని వారికి అభినందలు తెలిపారు. సవారి మూవీ మంచి విజయం సాధించాలని కాంక్షించారు. దీనితో చిత్ర హీరో మరియు దర్శక నిర్మాతలు తన చిత్రం పట్ల ఆయన స్పందించిన తీరుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఓ విభిన్నమైన కథతో సవారి చిత్రం తెరకెక్కగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు. సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుదితి నిర్మాతలుగా సవారి చిత్రం రూపొందించారు. ఈ చిత్ర ట్రైలర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాస్ దక్కింది.

Exit mobile version