ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ హరి భాస్కర్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు సంతోష్ పి జయకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం చితక్కొట్టుడు 2. తమిళ సినిమా ఇరాండమ్ కూతుత్తు కి తెలుగు వెర్షన్ గా చితకొట్టడు 2 రాబోతుంది. గతంలో సంతోష్ పి జయకుమార్ తమిళంలో తెరకెక్కించిన ఇరత్తు అరియిల్ మురత్తు కూత్తు, గజనీకాంత్ వంటి సినిమాలు కమర్షీయల్ సూపర్ హిట్స్ గా నిలిచాయి.
ఈ నేపథ్యంలో చితకొట్టడు 2 ని గతంలో వచ్చిన అడల్ట్ హరర్ కామెడీ ల కంటే మరింత ఎంటర్ టైనింగ్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు దర్శకుడ సంతోష్ పి జయకుమార్. అంతేకాదు ఈ చిత్రంలో తానే స్వయంగా హీరోగా నటించడం విశేషం. సంతోష్ కి జోడిగా ఈ మూవీలో కరిష్మా, మీనల్, ఆకృతి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన చితకొట్టడు ఫస్ట్ లుక్ లో రొమాంటిక్ ఆడియెన్స్ కి కావాల్సిన అంశాలు అన్నిటితో పాటు అడల్ట్ కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండేలా డిజైన్ చేశారు దర్శకుడు సంతోష్ పి జయకుమార్ అండ్ టీమ్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకుని త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా హీరో కమ్ డైరెక్టర్ సంతోష్ పి జయకుమార్ తెలిపారు.