మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ రీస్టార్ట్ కావడానికి ఇంకాస్త సమయం పడుతుందన్న వార్తలతో అభిమానులు కొద్దిగా నిరాశ చెందారు. ద్వితీయార్థంలో మార్పుల కోసమే ఈ ఆలస్యం అనడంతో వారిలో ఆందోళన మొదలైంది. సినిమాకు స్క్రిప్ట్ వర్క్ సరిగా జరగలేదేమోనని అనుమానపడ్డారు. అయితే ఈ ఆలస్యానికి కారణం స్క్రిప్ట్ సరిగా కుదరకపోవడం కాదట.. ఇంకాస్త బెటర్మెంట్ కోసమని తెలుస్తోంది.
కొరటాల శివ సినిమాలు ఎక్కువ శాతం సీరియస్‌గానే ఉంటాయి. ఒక్కసారి మెయిన్ కథలోకి సినిమా ప్రవేశిస్తే వేరే డీవియేషన్స్ ఏమీ ఉండవు. అయితే చిరు సినిమాలో ఎంటర్టైన్మెంట్ శాతం కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకుంటే బాగుటుందని భావించారట. అప్పుడే సీరియస్‌నెస్, కామెడీ రెండూ సమపాళ్లలో ఉండి ప్రేక్షకులు మరింత ఎక్కువ ఎంటర్టైన్ అవడానికి అవకాశం ఉంటుందనేది చిరు ఆలోచన. అందుకే కొద్దిగా టైమ్ తీసుకుని మంచి కామెడీ ట్రాక్స్ రూపొందించడానికి పూనుకున్నారు కొరటాల శివ.
మోస్ట్లీ సంక్రాతి తర్వాత షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. కొరటాల తన ఎవరు గ్రీన్ ఫార్ములా అయినా కమర్షియాలిటీ, సోషల్ మెసేజ్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ సైతం ఇందులో ఒక ప్రధాన పాత్ర చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.