బాలీవుడ్ సినిమా రీసెంట్ గా అందించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా హీరోయిన్ రష్మిక మందన్నా కలయికలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఒక్క భాషలోనే వచ్చినప్పటికీ హాట్ టాపిక్ గా మారింది. ఇలా వరల్డ్ వైడ్ ఇపుడు మొదటి వారం రన్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోగా ఈ వారం రోజుల్లో భారీ మొత్తంలో వసూలు చేసింది.
ఇండియా వైడ్ గా మొదటి 7 రోజుల్లో 225 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకుంటే వరల్డ్ వైడ్ ఓవరాల్ గా 310.5 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొదటి వారం ఈ చిత్రం సెన్సేషనల్ నంబర్స్ ని నమోదు చేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.