మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పై విస్తృతంగా ప్రచారం కలిపిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ జె నేతృత్వంలో రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న రామ్ చరణ్ మూడు మొక్కలు నాటారు. రెబల్ స్టార్ ప్రభాస్ నుండి ఈ ఛాలెంజ్ స్వీకరించిన రామ్ చరణ్, మరో ఇద్దరిని నామినేట్ చేశాడు. దర్శక ధీరుడు రాజమోళి మరియు హీరోయిన్ అలియా భట్ ని నామినేట్ చేయడం జరిగింది.
రామ్ చరణ్ విసిరిన ఛాలెంజ్ కి అలియా భట్ స్పందించారు. ఈ కార్యక్రమాన్ని తనను రామ్ చరణ్ నామినేట్ చేసినందుకు అలియా సంతోషం వ్యక్తం చేశారు. ఐతే లాక్ డౌన్ సమయంలో అలియా తన గార్డెన్ లో అనేక మొక్కలు నాటినట్లు చెప్పారు. ఐతే అప్పుడు నేను మొక్కలు నాటిన ఫోటోలు నా దగ్గర లేవు. కానీ నేను మరలా మూడు మొక్కలు నాటే ముందే, ఓ ముగ్గురిని నామినేట్ చేస్తానని, అలియా భట్…శ్రద్దా కపూర్, దియా మీర్జా, భూమి పెడ్నేకర్ లను నామినేట్ చేయడం జరిగింది. ఇక ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ రామ రాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ లవర్ సీత పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
Thank you for nominating me @AlwaysRamCharan. During the lockdown I had the time to do a lot of home gardening, where I learnt to pot my own plants. There truly is no better feeling than that!
— Alia Bhatt (@aliaa08) November 8, 2020