“రాధే శ్యామ్” మేకర్స్ ఈ రిస్క్ తీసుకుంటారా?

ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇంద్రియఞ్చ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్” కూడా ఒకటి. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఎప్పటి నుంచో ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఫైనల్ దశలో ఉంది.

ఇటీవలే ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని డార్లింగ్ కూడా నిన్ననే ఇండియాలో అడుగు పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఎలాగో పూర్తి అయ్యిపోవచ్చింది. మిగిలి ఉన్నది విడుదలే కావడంతో దానిపై రచ్చ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని అప్పుడు పరిస్థితులు బాగుంటే సంక్రాంతి రేస్ లోనే నిలుపుతారని టాక్ మొదలయ్యిపోయింది.

మరి ఇందుకు ఛాన్స్ ఉందా అంటే అందుకు చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయని చెప్పాలి. వాస్తవంగా మాట్లాడుకోవాలి అంటే ఈ కరోనా పరిస్థితులు పోయి ముందులాంటి జీవనం ఎప్పుడు మొదలవుతుందో అర్ధం కాని పరిస్థితి. బయట అంటే జనం అంతా తిరిగేస్తున్నారు కానీ థియేటర్ లోకి మాత్రం వచ్చే సాహసం చెయ్యడం లేదు.

అది కూడా సంక్రాంతి టైం కు ఎలా ఉంటుందో అన్నది కూడా ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. సో ఇంత పెద్ద సినిమా ఈ తక్కువ గ్యాప్ లోనే వచ్చేసి అంత మొత్తాన్ని రాబట్టే పని జరిగేనా? మేకర్స్ ఈ రిస్క్ తీసుకొనే ఛాన్స్ అంతకంటే లేదు. మరి రాధే శ్యామ్ విడుదల విషయంలో వినిపిస్తున్న వార్తలపై మేకర్స్ ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి.

Exit mobile version