హలో ఫ్రెండ్స్. బాక్స్ ఆఫీస్ బాబు రావు మళ్లీ మీ ముందుకు వచ్చాడు. ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ ‘గబ్బర్ సింగ్’ సినిమా ఈ నెల 11న విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమాకి సంభందించిన సమాచారం మీతో చర్చించడానికి ఆ రోజు ఉదయం 8:45 గంటలకు సిద్ధంగా ఉంటాడు.
అతను మీతో లైవ్ చాట్ చేస్తూ అందుబాటులో ఉంటాడు. మీకు ఏమైనా సందేహాలుంటే అతనిని అడగవచ్చు. గబ్బర్ సింగ్ చిత్రానికి సంబందించిన తాజా సమాచారాన్ని సంక్షిప్తంగా మీకు అందిస్తాడు. ఏ థియేటర్ జనాలతో నిండిపోయింది, అక్కడ వారి రెస్పాన్స్ ఎలా ఉంది మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తుంటాడు. ఇంకా చాలా విషయాలు మీతో లైవ్ చాట్ చేస్తూ వార్తలు, ఫోటోలు, వీడియోలు అందిస్తాడు.
అతను మీకు నచ్చిన హీరో, నచ్చిన సినిమా గురించి సమగ్ర సమాచారం ఇస్తాడు. మే 11వ తారీఖున ఉదయం 8:45 గం.ల నుండి
బాక్స్ ఆఫీస్ బాబూ రావు లైవ్ లో మీకోసం ఉంటాడు. సిద్ధంగా ఉండండి.
నోట్: ఈ పాత్ర కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదు.