ఐకాన్ స్టార్ కోసం సిద్ధమవుతున్న మలయాళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్..?

ఐకాన్ స్టార్ కోసం సిద్ధమవుతున్న మలయాళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్..?

Published on Jun 13, 2025 5:46 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేయగా ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ తన నెక్స్ట్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు టాలీవుడ్ దర్శకులతో పాటు తమిళ దర్శకులు బన్నీకి కథలు వినిపిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ జాబితాలో ఓ మలయాళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కూడా జాయిన్ అయ్యాడట. మలయాళంలో తనదైన చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ దర్శకుడిగా కూడా తన సత్తా చాటాడు. ఇక ఇప్పుడు ఆయన ఓ సాలిడ్ కథను రెడీ చేసి బన్నీకి వినిపించాడని తెలుస్తోంది.

ఈ కథపై బన్నీ కూడా ఆసక్తిని చూపాడని.. అయితే, తన నిర్ణయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే, ఈ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు అభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు