‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Jun 14, 2025 9:00 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ చిత్రం “ఓజి” కూడా ఒకటి. పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ హైప్ ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతుంది. అయితే ఈ విడుదలకి ముందు సినిమా పవర్ఫుల్ సాంగ్ ఫస్ట్ సింగిల్ గా విడుదల కావాల్సి ఉంది.

నిజానికి దీనిని మేకర్స్ ఎప్పుడో… విడుదల చేయాల్సింది కానీ పలు కారణాలు చేత చేయలేదు. ముఖ్యంగా దీనికి ముందు హరిహర వీరమల్లు విడుదల కావాల్సి ఉంది. దీనితో ఒక్కసారి వీరమల్లు విడుదల అయ్యాక ఓజి ర్యాంపేజ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఓజి ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ శింబుతో థమన్ కంపోజ్ చేసిన ఈ పాటపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు