రిలీజ్‌కు ముందే అదరగొడుతున్న ‘ఘాటి’.. అనుష్క క్రేజ్ మామూలుగా లేదుగా!

రిలీజ్‌కు ముందే అదరగొడుతున్న ‘ఘాటి’.. అనుష్క క్రేజ్ మామూలుగా లేదుగా!

Published on Jun 14, 2025 1:33 AM IST

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

అయితే, తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ చిత్ర బిజినెస్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌కు భారీ డీల్ కుదురినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నాన్-థియేట్రికల్ రైట్స్‌కు ఏకంగా రూ.36 కోట్ల భారీ డీల్ ఫిక్స్ అయినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ స్థాయిలో నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాతో అనుష్క మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమె సినిమాలపై అభిమానుల్లో ఎలాంటి క్రేజ్ ఉంటే, ఈ స్థాయిలో నాన్-థియేట్రికల్ డీల్ జరుగుతుందని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాను దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా, థియేట్రికల్ బిజినెస్‌తో మేకర్స్ లాభాలను పొందడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 11న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు