ఎన్టీఆర్ నెక్స్ట్ చిత్రాలు ఓకే.. మరి కొరటాల పరిస్థితి ఏమిటి..?

ఎన్టీఆర్ నెక్స్ట్ చిత్రాలు ఓకే.. మరి కొరటాల పరిస్థితి ఏమిటి..?

Published on Jun 14, 2025 3:02 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్-2’ మూవీని రెడీ చేసిన తారక్, తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ చిత్రాలను కూడా ఇప్పటికే లైన్‌లో పెడుతున్నాడు. ఇందులో తమిళ దర్శకుడు నెల్సన్‌తో ఓ సినిమా ఉండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కూడా ఓ సినిమా రానుంది.

2026లో ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ అవుతుందని అంచనా. ఆ తర్వాత 2027లో నెల్సన్-ఎన్టీఆర్ మూవీ.. 2028లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా వస్తాయని అంచనా. అయితే, ఇప్పుడు అసలు సమస్య ఇక్కడే తలెత్తుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కించిన కొరటాల శివ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ‘దేవర-2’ని తెరకెక్కించాలి. అయితే, ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే, ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు.

దీంతో అసలు కొరటాల శివతో ఎన్టీఆర్ ‘దేవర-2’ ఎప్పుడు పట్టాలెక్కిస్తాడు.. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు.. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంపై ఎన్టీఆర్ లేదా కొరటాల ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు