తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ సీక్వెన్స్ గురించి ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.
గతంలో ‘విక్రమ్’ చిత్రంలో హీరో సూర్యతో రోలెక్స్ అనే పవర్‌ఫుల్ కేమియో చేయించాడు లోకేశ్. ఆ పాత్రలో సూర్య పర్ఫార్మెన్స్.. ఆ పాత్రను ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. ఇక ఈ పాత్ర ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే తరహా పాత్రను బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌తో చేయిస్తున్నాడు దర్శకుడు లోకేశ్.
ఈ సినిమాలో అమీర్ ఖాన్ చేయబోయేది కేమియో పాత్ర అని.. ఇది సినిమా చివర్లో వస్తుందని.. ప్రేక్షకుల్లో సాలిడ్ ఇంపాక్ట్ చూపిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమాలోనూ రోలెక్స్ తరహా ట్రీట్ ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.