‘కన్నప్ప’ ట్రైలర్ కి టైం ఫిక్స్!

‘కన్నప్ప’ ట్రైలర్ కి టైం ఫిక్స్!

Published on Jun 14, 2025 10:06 AM IST

టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటించిన తన అవైటెడ్ డ్రీం ప్రాజెక్ట్ సినిమానే “కన్నప్ప”. సౌత్ నుంచి నార్త్ నార్త్ వరకు పాన్ ఇండియా లెవెల్లో టాప్ స్టార్స్ కలయికలో భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా వస్తుంది. మహాభారతం సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ ఎపిక్ హిస్టారికల్ డ్రామా నుంచి ట్రైలర్ నిన్ననే విడుదల కావాల్సి ఉంది కానీ వాయిదా పడింది.

మరి ఫైనల్ గా ఈ ట్రైలర్ కి ఇపూడి సమయం లాక్ అయ్యింది. మంచు స్వయంగా ఈ సినిమా ట్రైలర్ నేడు జూన్ 14న సాయంత్రం 6 గంటలకి విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసాడు. సో ఈ సాయంత్రం వరకు ఈ భారీ మల్టీస్టారర్ తాలూకా ట్రైలర్ రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి దిగ్గజాలు నటిస్తుండగా స్టీఫెన్ డేవెస్సి సంగీతం అందిస్తున్నారు. అలాగే మోహన్ బాబు నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు