ఫ్యాన్స్ కి బాలయ్య విఙ్ఞప్తి..!

మరి కొద్దిసేపట్లో బాలయ్య ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా టీజర్, బాలయ్య పాడిన పాట సాయంత్రం 7:09 నిమిషాలకు విడుదల అవుతుంది. అయితే తన జన్మదిన వేడుకలను మాత్రం ఘనంగా నిర్వహించవద్దని అభిమానులకు బాలయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.

స్నేహితులు, అభిమానుల మధ్యలో జన్మదిన వేడుకలు చేసుకునే అదృష్టానికి అంతరాయం ఏర్పడిందని, కరోనా మహమ్మారి కారణంగా అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అభిమానులెవరినీ కలవడం లేదని బాలకృష్ణ తెలిపారు. ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసుకుని ఎవరూ తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ క్షేమంగా ఉండడమే తనకు దక్కే అద్భుతమైన ఆశీర్వాదమని పేర్కొన్నారు. తన విన్నపాన్ని మన్నించాలని కోరారు.

Exit mobile version