చిన్ని కృష్ణ దర్శకత్వంలో నటించనున్న బాలకృష్ణ

చిన్ని కృష్ణ దర్శకత్వంలో నటించనున్న బాలకృష్ణ

Published on Nov 30, 2012 10:43 AM IST

బాలకృష్ణ మరో చిత్రానికి సంతకం చేశారు ఈ చిత్రానికి చిన్ని కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. చిన్ని కృష్ణ ఈ మధ్య నిఖిల్ హీరోగా “వీడు తేడా” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు. డిసెంబర్లో మొదలు కానున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన తార కథానాయికగా నటించనుంది. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు. ఈ ఏడాది మొదట్లో బాలకృష్ణ “శ్రీ రామరాజ్యం” చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం తరువాత “ఆదిత్య 369” చిత్రానికి సీక్వెల్ లో నటిస్తున్నట్టు పుకార్లు వచ్చాయి ఇదే కాకుండా కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించనున్నారు అన్న పుకార్లు కూడా వచ్చాయి. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశల్లోనే ఉన్నాయి. బాలకృష్ణ 100వ చిత్రానికి దగ్గర పడుతుండటంతో ఆయన చెయ్యబోయే చిత్రాల మీద అంచనాలు మరింత పెరిగింది.

తాజా వార్తలు