నేటి నుంచి బాహుబలి కొత్త షెడ్యూల్

నేటి నుంచి బాహుబలి కొత్త షెడ్యూల్

Published on Sep 16, 2013 8:00 AM IST

Bahubali
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – యంగ్ హీరో రానా దగ్గుబాటి అన్నదమ్ములుగా, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ ‘బాహుబలి’. ఈ సినిమాకి సంబందించిన తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. దీని కోసం ఓ స్పెషల్ సెట్ ని రూపొందించారు. ఇటీవలే ఈ సినిమా కోసం రూపొందిస్తున్న సెట్స్ ని చూసి రామోజీ రావు ఈ చిత్ర యూనిట్ ని ప్రశంసించారు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ‘ఈగ’ సుదీప్ ఓ అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

తెలుగు సినిమా రంగంలో ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్ తో ‘బాహుబలి’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో హై రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయి, ఇప్పటికే ఓ స్పెషల్ టీం విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేయడం మొదలు పెట్టారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు