గతంలో “బాణం” చిత్రానికి దర్శకత్వం వహించిన చైతన్య దంతులూరి ప్రస్తుతం బ్రహ్మానందం తనయుడు గౌతంతో కలిసి “బసంతి” అనే చిత్రం చెయ్యనున్నారు. గతంలో చైతన్య దంతులూరి నారా రోహిత్ ని పరిచయం చేస్తూ “బాణం” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఆ చిత్రం విడుదల తరువాత చైతన్య చాలా విరామం తీసుకున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో ఒక చిత్రం తెరకెక్కిస్తున్నారు అని ఒక పుకారు కూడా వచ్చింది. ఇప్పుడు గతంలో రెండు చిత్రాలలో నటించి విజయం కోసం ఎంతగానో వేచి చూస్తున్న గౌతంతో జత కలిసారు. గతంలో గౌతం నటించిన “పల్లకిలో పెళ్లి కూతురు” మరియు ” వారెవా” రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూశాయి. “బసంతి” చిత్రం విజయం సాదిస్తుందని గౌతం చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.