హీరోయిన్ ఇంట్లో ఎన్టీఆర్ ‘బాద్షా’ షూటింగ్

హీరోయిన్ ఇంట్లో ఎన్టీఆర్ ‘బాద్షా’ షూటింగ్

Published on Nov 26, 2012 8:30 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్షా’ ప్రస్తుతం హైదరబాదులో షూటింగ్ వేగంగా జరుగుతుంది. హైదరబాదులో వేసిన ఒక ఇల్లు సెట్లో కాజల్ అగర్వాల్ మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్లో కమెడియన్స్ అందరి మీద కామెడీ సన్నివేశాలు షూట్ చేస్తారు. ఈ చిత్ర ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ కడుపుబ్బా నవ్విస్తాయని సన్నివేశాలన్నీ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇలాగే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి 2013 మర్చి నెలాఖరు వరకు విడుదల చేస్తామని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అంతర్జాతీయ గాయకుడూ అకాన్ తో ఒక పాట పాడించబోతున్నారు. కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్ట్ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకుడు.

తాజా వార్తలు