అయేషా శివ ఎవరా అని ఆలోచిస్తునారా.? సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘బుజినెస్ మాన్’ చిత్రంలో కాజల్ అగర్వాల్ స్నేహితురాలి పాత్రలో వచ్చి రాని తెలుగుతో మాట్లాడిన అమ్మాయి గుర్తుందా.. ఆ అమ్మాయే అయేషా శివ. చాలా రోజుల తర్వాత ఆమె ఒక తెలుగు సినిమాలో నటించనుంది. సుశాంత్ మరియు వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ట్విస్ట్’ చిత్రంలో ఈ భామ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రేగిన కథానాయికగా నటిస్తున్నారు. స్వతహాగా కెనడియన్ మోడల్ అయిన ఈ భామ ఒక ప్రముఖ న్యూస్ పేపర్ తో మాట్లాడుతూ ‘ తెలుగు సినిమాల్లో నటించడం చాలా ఆనందంగా ఉంది మరియు ఈ సినమాల వల్ల నాకు మంచి గుర్తింపు వస్తోందని’ ఆమె అన్నారు. ఎంటర్టైన్మెంట్ స్టూడియో బ్యానర్ పై ఎన్.ఎం పాష నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శశి సుడిగల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.ఎస్ జ్ఞానశేఖర్ సినిమాతో గ్రాఫర్ పనిచేస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.