అక్టోబర్ చివర్లో రానున్న ‘ఆటోనగర్ సూర్య’


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మరియు అందాల భామ సమంత నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆటో నగర్ సూర్య’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ చివరి వారంలో విడుదల చేయనున్నారు. చాలా కాలంగా ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు పోస్టర్లను కొన్ని వారాల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు తెలియజేశారు మరియు దేవకట్టా తీసిన ‘వెన్నెల మరియు ‘ప్రస్థానం’ చిత్రాల ద్వారా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version