రెండోరోజు కూడా వసూళ్లు దుమ్ముదులిపిన అశ్వథామ

అశ్వథామ మూవీ వసూళ్లు జోరు కొనసాగుతుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం హిట్ వైపుగా దూసుకుపోతుంది. మొదటి రోజు 3.6 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లతో హీరో నాగ శౌర్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం రెండవ రోజు మరిన్ని వసూళ్లు రాబట్టింది. మొదటి రోజుకు మించిన వసూళ్లు చేజిక్కించుకున్న అశ్వథామ ఇప్పటి వరకు 7.05కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది . తెలుగు రాష్ట్రాలలో అశ్వథామ థియేటర్స్ సంఖ్యను పెంచినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక నూతన దర్శకుడు రమణ తేజ అశ్వథామ చిత్రాన్ని సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్యూటీ మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా శ్రీచరణ్ పాకాల సాంగ్స్ అందించారు. అశ్వథామ చిత్రం కొరకు హీరో నాగ శౌర్య స్వయంగా కథ అందిచడం విశేషం.

Exit mobile version