ఇంతకీ ‘దర్బార్’ హిట్టా.. ఫ్లాపా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘దర్బార్’. చిత్రం ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నా తమిళనాడులో బాగానే ఆడింది. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు చిత్రం దాదాపు రూ.250 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడితే మంచి విజయమే అనాలి. కానీ ‘దర్బార్’ విషయంలో అలా జరగలేదట. సినిమా ఫ్లాప్ అని, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదని, నష్టపోయిన వారంతా డైరెక్టర్ మురుగదాస్ పట్ల అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

అలాగే నష్టాలకి కారణం అధిక బడ్జెట్. ఈ బడ్జెట్ కూడా సినిమా మేకింగ్ కోసం పెట్టినది కాదట. రజనీ, మురుగదాస్ భారీ మొత్తంలో పుచ్చుకున్న రెమ్యునరేషన్ అని అంటున్నారు. వారిద్దరూ రెమ్యునరేషన్ తగ్గించి ఉంటే నిర్మాతలు తక్కువ ధరలకు అమ్మేవారని, అప్పుడు కొన్నవారు లాభాలు లేకపోయినా నష్టాల్లో పడేవారు కాదని అంటున్నారు. మరోవైపు రజనీ ఫ్యాన్స్ మాత్రం అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని, సినిమా హిట్టని, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ నష్టపోలేదని వాదిస్తూ లెక్కలు కూడా చూపుతున్నారు.

Exit mobile version