అర్చనకు దర్శకత్వం చెయ్యాలని కోరికట

అర్చనకు దర్శకత్వం చెయ్యాలని కోరికట

Published on Sep 23, 2013 5:43 PM IST

Archana

చాలా రోజులనుండి ఇండస్ట్రీలో వుంటున్న అతి తక్కువ మంది ఆంధ్రాకు చెందిన అమ్మాయిలలో అర్చన ఒకరు. గతంలో కొన్ని విభిన్న పాత్రలను పోషించిన ఆమె ప్రస్తుతం ‘పంచమి’ అనే సినిమాలోనటిస్తుంది . ఈ సినిమా మొత్తానికీ ఆమె పాత్ర ఒక్కటే వుండడం విశేషం ఈ భామ ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “నేను నటిని గనుక కాకపోయివుంటే ఏ డ్యాన్సర్ నో డైరెక్టర్ నో అయ్యేదాన్ని. శ్రీదేవి నటించిన ‘వసంతకోకిల’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మరియు ‘క్షణక్షణం’ పాత్రలు వంటివి చెయ్యాలని కోరికట'”. మీ అందానికి రహస్యం ఏమిటి అని అడిగితే “నేను ఎక్కువ పండ్లు, మంచి నీళ్ళు తాగుతాను. నేను మూలలకు కట్టుబడి ఉంటానని” తెలిపింది. తను అనుకున్నది సాధించడానికి ఎంతటి కష్టమైనా ఆత్మవిశ్వాసంతో జయించి ముందుకి సాధించడం తన లక్ష్యం అని తెలిపింది

తాజా వార్తలు