“కేజీయఫ్” ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశేనా.?

ఇప్పుడు మన దక్షిణాది నుంచి రానున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2” ఒకటి. దీనికి ముందు వచ్చిన చాప్టర్ 1 అన్ని భాషల్లో భారీ విజయం అందుకొనేసరికి దీని సీక్వెల్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

కానీ ఇప్పటికే ఈ చిత్రం నుంచి చాలానే అప్డేట్స్ వచ్చాయి కానీ టీజర్ కు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనితో దాని కోసం అభిమానులు దేశ వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ దసరాకు టీజర్ వస్తుంది అని టాక్ వినిపించింది. కానీ అది నిజం కాలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ టీజర్ ఇప్పుడప్పుడే కూడా వచ్చేలా లేదని కూడా తెలుస్తుంది.

ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం చాలా మందే ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి మేకర్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తారో చూడాలి. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. హోమ్ బేల్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version