స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి గాను థమన్ అందించిన సంగీతం ఎంత పెద్ద ప్లస్ అయ్యిందో తెలిసిందే.
అలాగే ఈ చిత్రంలోని హిట్ ట్రాక్ “బుట్ట బొమ్మ” ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంత పెద్ద సెన్సేషన్ ను నమోదు చేసిందో కూడా చూసాము. అయితే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు మాత్రం ఈ పాటను మన వాళ్ళు అంకితం చేసేసేలా ఉన్నారు. ఆ మధ్య వార్నర్ ఈ పాటకు గాను సిగ్నేచర్ స్టెప్ వేస్తే అది భారీ స్థాయిలో వైరల్ అయ్యింది.
ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లలో కూడా వార్నర్ ప్రమోషన్స్ లో ఈ సాంగ్ కు మరోసారి స్టెప్పేసాడు. ఇక అలాగే లేటెస్ట్ గా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ మ్యాచ్ ను ప్లే ఆప్స్ లోకి తీసుకెళ్లే క్రమంలో కీలక పాత్ర వహించిన వార్నర్ కు సోషల్ మీడియాలో అంతా బన్నీ సాంగ్ ను ఖచ్చితంగా వార్నర్ తో ట్యాగ్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం బన్నీ సాంగ్ వార్నర్ కు బాగా అంటే బాగా అటాచ్ అయ్యిందని చెప్పాలి.