జానీ మాస్టర్ కోరియోగ్రఫీలో డాన్స్ చేయనున్న అల్లు అర్జున్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆధ్వర్యంలో డాన్స్ చేయనున్నాడు. ‘జులాయి’ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ నెల 9వ తేదీ నుండి ఈ పాట చిత్రీకరించనున్నారు. జానీ మాస్టర్ ఇటీవలే ‘రచ్చ’ సినిమాలో డిల్లకు డిల్లకు అనే పాటకి కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే దుబాయ్ లో పాటల చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఇలియానా హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.

Exit mobile version