తమిళ రంగంలో సినిమా దేవుడిగా మన్ననలను పొందుతున్న అతికొద్దిమంది నటులలో ఒకరు అజిత్. అతని మనస్తత్వానికి, మంచి హృదయానికి నిదర్శనం అతని అభిమానుల సంఖ్యే తెలుపుతుంది. తమిళ సినిమాలో లైట్ బాయ్ నుండి నిర్మాత వరకూ అతనితో స్నేహంగా వుంటారు. అజిత్ సికిందిరాబాద్ లోనే పుట్టారని చాలా తక్కువమందికి తెలుసు
తన దగ్గర పనిచేస్తున్న వారికి చెన్నైలో ఒక ల్యాండ్ తీసుకుని అక్కడ పది ఇళ్ళను కట్టిస్తుండడం అతని మంచి మనసుకి నిదర్శనం . అంతే కాక ఈ పని సంకుస్థాపనకు తన భార్య షాలిని చేతులు మీదుగా జరగడం మరో విశేషం. చాలా వరకూ గుప్త దానాలు చెయ్యడం అజిత్ అలవాటు
ఈరోజు ఆటను నటించిన ‘ఆరంభం’ సినిమా పాటలు, ట్రైలర్ విడుదలయ్యాయి. దీపావళికి ఈ సినిమా విడుదల చేస్తారని చెప్పడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు