ఇంప్రెసివ్ గా రోషన్ మేక “ఛాంపియన్” టీజర్!

ఇంప్రెసివ్ గా రోషన్ మేక “ఛాంపియన్” టీజర్!

Published on Nov 1, 2025 12:05 PM IST

సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యి మంచి సక్సెస్ ని చూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా తన నెక్స్ట్ సినిమాగా దర్శకుడు ప్రదీప్ అద్వైతంతో చేస్తున్న భారీ బడ్జెట్ సినిమానే “ఛాంపియన్”.

బడా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ లాంటి సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమా తాలూకా టీజర్ ని ఇప్పుడు మేకర్స్ వదిలారు. మరి ఈ టీజర్ మాత్రం ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. రోషన్ మంచి స్పోర్ట్స్ జానర్ కమర్షియల్ సబ్జెక్టుతో వస్తున్నట్టు ఈ టీజర్ లో చూస్తే అర్ధం అవుతుంది.

వింటేజ్ బ్యాక్ డ్రాప్ అప్పటికి తగ్గ సెటప్ అంతా చూస్తుంటే కొత్త వరల్డ్ క్రియేట్ చేసారని అనిపిస్తుంది. రోషన్ కూడా నటన, తెలంగాణ యాసలో ఆకట్టుకున్నాడు. అలానే మిక్కీ జే మేయర్ స్కోర్ కూడా ఇందులో బాగుంది. ఓవరాల్ గా మాత్రం మంచి ప్రామిసింగ్ టీజర్ ని మేకర్స్ వదిలారు. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో ఏం ప్లాన్ చేశారో చూడాలి.

తాజా వార్తలు