మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘అడ్డా’


సుశాంత్ మరియు శాన్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘అడ్డా’ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నాగ సుశీల మరియు చింతలపూడి శ్రీనివాస రావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. సాయి కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ ఈ చిత్ర టైటిల్ చూసి అందరూ ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని అనుకుంటున్నారు, కానీ ఇది పూర్తి ప్రేమ కథా చిత్రము. ఈ చిత్రం యొక్క ఉపశీర్షికను త్వరలోనే తెలియజేస్తామని’ ఈ చిత్ర దర్శకుడు సాయి కార్తీక్ తెలిపారు. రేపటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version