అత్తారింటికి దారేదికి భారీ ఓపెనింగ్స్

అత్తారింటికి దారేదికి భారీ ఓపెనింగ్స్

Published on Sep 25, 2013 8:50 AM IST

Attarintiki-Daredi-trailer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ బయటకి వచ్చిందో అప్పటి నుంచి ఫ్యాన్స్, సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అందరికీ షాక్ కలిగించేలా ఈ మూవీలోని 90 నిమిషాలు ఇంటర్నెట్ లో లీక్ అయినప్పుడు ఆ చిత్ర నిర్మాతకి మరియు ప్రొడక్షన్ టీం కి పబ్లిక్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.

ఈ రెండింటి వల్ల ఈ శుక్రవారం ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. టికెట్స్ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. అందరూ ఒకేసారి టికెట్స్ కోసం ఎగబడడంతో బుకింగ్ ఓపెన్ చెయ్యగానే టికెట్స్ సేల్ చేసే కొన్ని వెబ్ సైట్స్ సర్వర్ పూర్తిగా డౌన్ అయిపొయింది.

శశి పాత్రలో కనిపించనున్న సమంత – పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ చా క్యూట్ గా ఉంటుందని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.

తాజా వార్తలు