ఇంటర్వ్యూ : డైరెక్టర్ రాజ్ ఆర్ – 23 లాంటి సినిమా తీయడం వెరీ ఛాలెంజింగ్

ఇంటర్వ్యూ : డైరెక్టర్ రాజ్ ఆర్ – 23 లాంటి సినిమా తీయడం వెరీ ఛాలెంజింగ్

Published on May 15, 2025 12:59 AM IST

మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “23” తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. సినిమా మే 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ ఆర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఇందులో రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లో ఉన్న వ్యక్తి నటించాడు కదా.. ఆయనలో ఎలాంటి మార్పు గమనించారు?
19 ఏళ్ల వ్యక్తికున్న ఆలోచనలు 35 ఏళ్లప్పుడు ఉండవు. మనిషి ఆలోచనలు అతను తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా వయసుకు తగ్గట్టు మారుతూ ఉంటాయి. దీని వెనుక న్యూరో సైన్స్ ఉంటుంది. ఒకప్పుడు కరెక్ట్ అని అనుకున్న వ్యక్తి ఒక 20 ఏళ్ల తర్వాత రాంగ్ అని అనిపించొచ్చు. చేసిన తప్పులపై పశ్చాత్తాపం ఉంటుంది.

మీ గత సినిమాలు ఆహ్లాదకరంగా ఉంటాయి కదా.. ఇలాంటి సినిమా తీయడం వెనక కారణం?
నేను ప్రతి కథని ఏదో ఐడెంటిఫై చేసుకుని చేసిందే. మల్లేశం కథ కూడా నేను అలా ఐడెంటిఫై చేసుకునే తీశాను. అయితే ఆ సినిమాని అంతమంది ఆడియన్స్ చూస్తారని నేను అనుకోలేదు. మనిషి ఫెయిల్ అయిన పరవాలేదు అనుకుని తీసిన సినిమా.
కోవిడ్ తర్వాత అందరం కూడా మెంటల్ హెల్త్ కి గురయ్యాము.8 A.M. Metro కథ అలా వచ్చినదే. 23 సినిమా తీయడానికి కారణం నేను ఓ ఏజ్ లో కొన్ని తప్పులు చేశాను. ఇప్పటికీ కొన్ని గుచ్చుకుంటాయి. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అయితే హ్యాపీ.

ఈ సంఘటనలన్నీ చాలా డీప్ సబ్జెక్టు కదా.. దాన్ని సినిమాగా చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
నిజానికి ఇది చాలా టఫ్ సబ్జెక్టు. ప్రొడక్షన్ పరంగా రైటింగ్ పరంగా అన్నిటి పరంగా ఇది చాలా టఫ్. ఇలాంటి సబ్జెక్టు తీయడం వెరీ చాలెంజింగ్. ఇన్ని లొకేషన్స్ ఇన్ని టైం ఫ్రేమ్స్ లో రాయడం దాన్ని తీయడం దాన్ని అర్థం చేసేలా చూపించడం కూడా చాలా కష్టం. ఏకగ్రతతో చూడాల్సిన సినిమా ఇది. ఆడియన్స్ కాస్త కాన్సెంట్రేట్ చేసి చూడాలి.

ఈ కథలో ఎలాంటి విషయాలు చర్చించారు?
ఇందులో మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయి. అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ 90%. ఇది స్టార్ట్ కాకముందు చుండూరు ఘటన తర్వాత జూబ్లీహిల్స్ ఘటన చూపించడం జరుగుతుంది. అయితే ఒకరికి తక్కువ శిక్ష ఎందుకు పడింది? ఒకరికి ఎక్కువ శిక్ష ఎందుకు పడింది అనేది చర్చించడం మరో థీమ్.

నటీనటులు గురించి?
నిజానికి ఒక 10 ఏళ్ళు యాక్టింగ్ చేస్తే గాని ఇలాంటి రోల్స్ చేయలేరు. ఇలాంటి రూల్స్ వాళ్లకు దొరకడం లాటరీ టికెట్ అనుకోవాలి. మొదట నాకు కూడా నమ్మకం లేదు. అయితే ఫస్ట్ ఒక షెడ్యూల్ చేసి చూద్దామని భావించాను. సరిగ్గా వస్తే సినిమా చేస్తాను లేకపోతే ఆపేస్తానని ముందే చెప్పాను. అయితే నటీనటులంతా చాలా అద్భుతంగా చేశారు. అందరూ కూడా పాత్రలకు జీవం పోశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు