ప్రభాస్ తో ప్రాజెక్ట్ పై ప్రశాంత్ వర్మ సాలిడ్ అప్డేట్!

ప్రభాస్ తో ప్రాజెక్ట్ పై ప్రశాంత్ వర్మ సాలిడ్ అప్డేట్!

Published on Sep 6, 2025 11:01 AM IST

ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి హీరోస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలతో పాటుగా ఇంకా చేయాల్సిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వీటిలో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా ఓ సినిమా ఉన్న సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమా విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన లేటెస్ట్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పై పెద్దగా మాట్లాడడానికి లేదని. కానీ సిద్ధంగానే ఉండండి తాము షూటింగ్ కోసం రెడీగానే ఉన్నామని ఒక్కసారి హీరో డేట్స్ దొరికితే సినిమా పట్టాలెక్కించేస్తామని తాను తెలిపాడు. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

తాజా వార్తలు