ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న లేటెస్ట్ కన్నడ బ్లాక్ బస్టర్!

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న లేటెస్ట్ కన్నడ బ్లాక్ బస్టర్!

Published on Sep 6, 2025 10:05 AM IST

గత కొంత కాలం నుంచి సాలిడ్ హిట్స్ అందిస్తున్న కన్నడ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన మరో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే “సు ఫ్రమ్ సో”. ప్రముఖ నటుడు రాజ్ బి శెట్టి నిర్మాణంలో దర్శకుడు జెపి తుమినాడ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ సినిమా ఇది కాగా కన్నడలో భారీ వసూళ్లు అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేశారు కానీ తెలుగులో మాత్రం అనుకున్న రేంజ్ రెస్పాన్స్ అందుకోలేదు.

ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి ఆడియెన్స్ ని అలరించడానికి సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ సెప్టెంబర్ 9 నుంచే అందుబాటులోకి వచ్చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. నిజానికి నిన్న 5నే రావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. అయితే ఈ సినిమాని హాట్ స్టార్ వారు మొత్తం 3 భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

తాజా వార్తలు