ప్రభాస్ ఇంతకుముందులా రెస్ట్ తీసుకుంటానంటే కుదరదట

రెబల్ స్టార్ ప్రభాస్ రెండు పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి బాలీవుడ్ మేకర్ ఓం రావత్ డైరెక్ట్ చేయనున్న ‘ఆదిపురుష్’ కాగా ఇంకొకటి నాగ్ అశ్విన్ చేయనున్న సైన్స్ ఫిక్షనల్ మూవీ. వీటిలో ‘ఆదిపురుష్’ ముందుగా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ చేస్తున్నారు. ప్రజెంట్ ఇటలీలో షూట్ జరుగుతోంది. డిసెంబర్ ఆఖరుకు ఈ సినిమా మొత్తం పూర్తవుతుంది. అది పూర్తైన వెంటనే జనవరి నుండి ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ చేస్తారట ఆయన.

అంటే ఇంతకుముందులా సినిమా సినిమాకు మధ్యలో నెలల తరబడి గ్యాప్ తీసుకోవడం లాంటివి ఉండవన్నమాట. జనవరిలో మొదలయ్యే షూట్ యొక్క ఫస్ట్ షెడ్యూల్ సైతం లెంగ్తీగానే ఉంటుందని తెలుస్తోంది. పైగా షెడ్యూల్ షెడ్యూల్ మధ్యలో సెలవులు సైతం ఎక్కువగా ఉండవట. ఆ చిత్రాన్ని త్వరగా ముగించి నాగ్ అశ్విన్ చిత్రాన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నారు ప్రభాస్. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు 2021 పూర్తయ్యేనాటికి నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ మేకింగ్ ఒక కొలిక్కి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. అంటే 2021 మొత్తం ప్రభాస్ కు రెస్ట్ అనేదే ఉండదని అర్థమవుతోంది.

Exit mobile version