100 సంవత్సరాల ఇండియన్ సినీ వేడుకల్లో అపశ్రుతులు

100 సంవత్సరాల ఇండియన్ సినీ వేడుకల్లో అపశ్రుతులు

Published on Sep 23, 2013 8:45 AM IST

100-years-of-india-cinema
భారదేశ చలన చిత్ర పరిశ్రమ 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలు ఎంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకని చెన్నై లో నిర్వహిస్తున్నాయి. నిన్న సాయంత్రం టాలీవుడ్ కి సంబందించిన వేడుక జరిగింది. ఈ వేడుకకి కె. విశ్వనాధ్, డా. డి రామానాయుడు, మంత్రి డీకే అరుణ, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, కె. బాలచందర్, వాణీశ్రీ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, కృష్ణంరాజు, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.

ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో కొన్ని అపశ్రుతులు కూడా దొర్లడం కొంతమందిని భాధపదేలా చేసింది. అందులో ఇండస్ట్రీ దిగ్గజాలైనటువంటి డా. అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, కృష్ణ, తదితరులు హాజరు కాకపోవడం ఒకటైతే, మంత్రి డీకే అరుణ పొరుగు రాష్ట్ర ఫడ్డపై తెలుగు సినిమాలు సరిగా తీయడం లేదని, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు అనగారిపోతున్నాయి అని విమర్శించడం, ఆర్. నారాయణమూర్తి ఆగ్రహానికి గురై స్టేజి పైకి వెళ్లి ఇది ఆడియో ఫంక్షన్ లా ఉంది కానీ 100 సంవత్సరాల వేడుకలా లేదని అనడం అలాగే కొంతమంది ప్రముఖుల పేర్లు వేయకపోవడం, అలాగే ప్రముఖుల ఫోటోలు మారిపోవడం లాంటి కొన్ని సంఘటనలు అక్కడికి వచ్చిన వారికి కాస్త బాధపడేలా చేసాయి. మిగిలిన అవార్డుల బహుకరణ కార్యక్రమం అంతా సజావుగా సాగింది.

తాజా వార్తలు