మాస్ రాజాతో చేతులు కలపనున్న క్రేజీ స్టార్..?

మాస్ రాజాతో చేతులు కలపనున్న క్రేజీ స్టార్..?

Published on Oct 28, 2025 4:31 PM IST

Ravi-Teja-&-Naveen-Polishet

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న పెయిడ్ ప్రీమియర్స్‌తో రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మాసివ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు రవితేజ ఓ మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అంటే.. అవుననే టాక్ వినిపిస్తోంది.

రైటర్ కమ్ డైరెక్టర్ బెజవాడ ప్రసన్న తాజాగా రవితేజతో పాటు మరో హీరో నవీన్ పొలిశెట్టికి ఓ కథ వినిపించాడట. వారికి ఈ కథ నచ్చడంతో ఈ సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ రాజాతో పాటు ఈ క్రేజీ స్టార్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా… ఎలాంటి నవ్వులు పూయిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరి నిజంగానే ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు